ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ..

Distribution of Chief Minister's Relief Fund cheques.నవతెలంగాణ – వేములవాడ 
వేములవాడ పట్టణానికి చెందిన వేగండ్ల సరోజన,కుమ్మరి లక్ష్మి కి, వేములవాడ అర్బన్ మండలం సంకే పల్లి గ్రామంలో  లబ్ధిదారులు పండుగు లచ్చవ్వ, కొండ సత్తవ్వ లకు, మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను  శనివారం  వారి వారి ఇళ్లకు వెళ్లి, కాంగ్రెస్ పార్టీ నాయకులు అందజేశారు.  ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ  అనారోగ్యంతో బాధపడి చికిత్స తీసుకుంటున్న నిరుపేదలకు సీఎంఆర్ చెక్కులను అందజేయడం చాలా సంతోషకరమని వారన్నారు. బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు రావడానికి కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లకుకృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి కనికరపు  రాకేష్, బీసీ సెల్ టౌన్ ప్రెసిడెంట్ నాగుల రాము గౌడ్, బిసి సెల్ నియోజకవర్గ ఇన్చార్జ్ అంబటి చంద్రశేఖర్ యాదవ్, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు రగుడు పర్శరాములు ,  తోట రాజు, కొండ శేఖర్, గ్రామ శాఖ అధ్యక్షుడు రాజ్ కుమార్ నాయకులు లాల నగేష్, వస్తాది కృష్ణ ప్రసాద్ గౌడ్,నాగుల మహేష్ గౌడ్, ఇన్నారం సాగర్,అశోక్, నాగరాజ్ తో పాటు  తదితరులు ఉన్నారు.