ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ

Distribution of Chief Minister's Relief Fund chequesనవతెలంగాణ – వలిగొండ రూరల్ 
మండలంలోని అరూర్, అక్కంపల్లి, టేకులసోమారం గ్రామాలకు చెందిన పలువురు అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన వారికి ఆసుపత్రి  ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిది నుండి మంజూరైన చెక్కులను తొడిమెల సత్యనారాయణ కు రూ.60 వేలు, చిట్టెడి సత్తమ్మ కు రూ.33 వేలు, రచ్ఛ పరమేష్ కు రూ.25 వేలు, గొడుగు నర్సింహా కు రూ.5,500 లు, దేప వెంకట్ రెడ్డి కి 30 వేలు, చేగూరి జంగయ్య కు రూ.37,500 లు,బుచ్చిరెడ్డి కి రూ.60 వేలు, కొంతం యాదయ్య కు రూ.13  వేళా చొప్పున మంజూరు అయిన చెక్కులను స్థానిక కాంగ్రెస్ నాయకులు మంగళవారం పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో పాశం సత్తి రెడ్డి, దేశిరెడ్డి వీరారెడ్డి, నిమ్మల కృష్ణ,బుర్ర నర్సింహా, సుక్క ముత్యాలు, కోడితాల కర్ణాకర్, కొప్పుల బాల రాజు, సుంకిశాల పరమేష్, పోలేపాక నర్సింహా, ఎట్టయ్య, మత్స్యగిరి, అంజయ్య, ప్రభాకర్, పాండు, వంశీ  తదితరులు పాల్గొన్నారు.