ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ..

Distribution of Chief Minister's Relief Fund cheques.నవతెలంగాణ – గాంధారి
మండల కేంద్రానికి చెందిన అనారోగ్యంతో బాధపడుతూ.. ప్రమాదంలో గాయపడి వివిధ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్న బాధితులకు ప్రభుత్వం ద్వారా మంజూరు అయిన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను స్థానిక కాంగ్రెస్ నాయకులు బాధితుల ఇంటికి వెళ్లి చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏం సి చైర్మన్ పరమేష్, కాంగ్రెస్ నాయకులు సంఘని, బాబా, లైన్ రమేష్, బొమ్మని బాలయ్య, నీళ్ల రవి, సంఘని బాలయ్య, గడ శంకర్, హైమద్, అల్తాఫ్, రామకృష్ణ తదితరులు ఉన్నారు.