మండలంలోని కర్లపల్లి గ్రామపంచాయతీ శివారు బూడిద గడ్డ అడవి ప్రాంతంలో నివసిస్తున్న ఆదివాసి గుత్తి కోయలకు మంగళవారం బల్గూరి మాదిగ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాదిగ దండోరా జాతీయ నాయకులు అంబేద్కర్ భవన్ విగ్రహ నిర్మాణ సమితి ములుగు జిల్లా చైర్మన్ నెమలి నరసయ్య హాజరై గుట్ట కోయలకు నూతన వస్త్రాలను పంపిణీ చేసి మాట్లాడారు.గత మూడు సంవత్సరాల క్రితం కరోనాతో మరణించిన కీ శే. బలుగూరి రమక్క జ్ఞాపకార్థం బలుగూరి మాదిగ ఫౌండేషన్ ములుగు జిల్లా ఆధ్వర్యంలో ఈ బట్టల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. బల్గురి మాదిగ ఫౌండేషన్ ములుగు జిల్లా ఆధ్వర్యంలో కీ శే.బలుగూరి రమక్క జ్ఞాపకార్థం చేపడుతున్న కార్యక్రమాలలో మొదటి సంవత్సరం కొండపర్తి లోని ఆదివాసీలకు దుప్పట్ల పంపిణీ, రెండవ సంవత్సరం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పిల్లలకు పుస్తకములు పంపిణీ మూడవ సంవత్సరం బూడిదగడ్డ ఆదివాసి గుట్ట కోయలకు బట్టల పంపిణీ కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో బలుగూరి పౌoడెషన్ చైర్మన్ బలుగూరి భద్రయ్యమాదిగ బంజరుపల్లి గారు కడు పేదరికం నుంచి వచ్చిన వారు గత సం రము మేకల పెంపకం కోసం బూడిద గడ్డకు పోయినప్పుడు అక్కడ పిల్లలు బట్టలు లేకుండా 20 మంది పిల్లలు కనపడడం వారికి మా ఫౌండేషన్ ద్వారా సాయం చేయాలని ఆలోచన కలగడం అభినందనీయమని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమంలో ములుగు జిల్లాతో పాటు ఉమ్మడి జిల్లాతో స్వచ్ఛందంగా,దేశవ్యాప్తంగా పేదరిక నిర్మూలన జరిగే కార్యచరణ తీసుకొని ముందుకు వెళ్లాలని సూచించారు. పిల్లలకు బట్టలు ఇవ్వాలి అని ఆలోచన బట్టలు పంపిణీ చేయాలని ఆలోచన మాదిగల మహాత్ముడు మహాజన ఆత్మ బంధువు మాన్యశ్రీ. మందకృష్ణ మాదిగన్న అనాధ పిల్లల హక్కుల వేదికరాష్ట్ర పోరాట సభకు హాజరైనప్పుడు పేద పిల్లలకు అండగా ఉంటుందన్న ఆలోచనలే నేడు బూడిద గడ్డ కుటుంబాలకు,చిన్న పిల్లలకు బట్టలు పంపిణీ చేసే వరకు దారితీసిందని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న బలుగూరి మాదిగ ఫౌండేషన్ ములుగు జిల్లా చైర్మన్ బలుగూరి భద్రయ్యమాదిగ, జిల్లా కార్యదర్శి బలుగూరి ఉపేందర్ , మాదిగ దండోరా జిల్లా నాయకులు జన్ను సుధాకర్ , కో చైర్మన్ లావుడియా రవినాయక్
మాదిగ దండోరా ములుగు మండల నాయకులు పసుల కృష్ణ, బూడిద గడ్డ గ్రామ వ్యవస్థాపకులు కుర్సం భద్రయ్య, మడివి దేవా,తో పాటు గ్రామంలో మహిళలు, గర్భిణి స్త్రీలు, చిన్న పిల్లలతో పాటు గ్రామస్తులు అందరు పాల్గొనినారు.