విద్యార్థులకు దుస్తులు పంపిణీ

నవతెలంగాణ – దుబ్బాక రూరల్
అక్బర్ పేట మండలం పరిధిలోని బొప్పాపూర్ గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలలో శుక్రవారం సర్పంచ్ బండమీది బాలమణి విద్యార్థులకు దుస్తుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం విద్య రంగానికి పెద్ద పీట వేస్తూ… ప్రతి పాఠశాలలో మౌలిక వసతులను కల్పిస్తోందని అన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అంజయ్య, ఉపాధ్యాయ బృందం, పంచాయతీ కార్యదర్శి, విద్యా కమిటీ చైర్మన్, వార్డు మెంబర్ రాగుల వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మట్టి రోడ్డు పనులకు ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు
బొప్పాపూర్ గ్రామం నుంచి ఆకారం వరకు సొంత ఖర్చులతో ఎమ్మెల్యే రఘునందన్ రావు మట్టి రోడ్డు నిర్మాణ పనులు చేసిన సందర్భంగా వారికి శుక్రవారం సర్పంచ్ బండమీది బాలామణి కృతజ్ఞతలు తెలిపారు. ఈ దారి ప్రయాణించే వాహనదారులకు మూడు కిలోమీటర్ల మేర సమయం ఆదా అవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు, బిజెపి నాయకులు ఉన్నారు.