
మండలంలోని బడా భీంగల్, బాచన్ పల్లి గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు దుస్తులను ఎంఈఓ స్వామి చేతుల మీదుగా అందజేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి విద్యార్థులకు ఉచితంగా అందజేసే దుస్తులను ఐకెపి ఆధ్వర్యంలో మహిళా సంఘాల ద్వారా కుట్టించిన దుస్తులను మంగళవారం అందజేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో ఉచిత సౌకర్యాలు కల్పిస్తుందని కనుక వీటిని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యను అభ్యసించే విధంగా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని ఎంఈఓ సందర్భంగా సూచించారు ఈ కార్యక్రమంలో ఏపీ ఎం రవీందర్, ఐకెపిసిసి లు కుంట శ్రీనివాస్, నరేష్ ,భాస్కర్ ,సాయిలు, గంగా లతా ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.