నవతెలంగాణ-మంగపేట
మండల కేంద్రంలోని గౌరారంవాగు ముంపు సినిమాహాల్ వడ్డెర కాలనీ బాదితులకు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో దుస్తులు, నిత్యావసరాలను ఏటూరునాగారం సీఐ రాజు, ఎస్సై రవికుమార్, మాజీ జడ్పీటీసీ శిద్దంశెట్టి వైకుంఠంలు అందజేశారు. శనివారం సాయంత్రం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సీఐ, ఎస్సై, మాజీ జడ్పీటీసీలు ముఖ్య అతిధులుగా హాజరై బాదిత 35 కుటుంబాలకు దుస్తులు, నిత్యావసరాలను అందజేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. వర్షాకాలం భారీ వర్షాల సమయంలో ముంపు బాదిత కుటుంబాలు అప్రమత్తంగా ఉండాలని మండల అధికారుల సూచనలు పాటించి వరద సహాయక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు శిద్దంశెట్టి శ్రీనివాసరావు, లక్ష్మణ్ రావు, పడమటింటి సత్యనారాయణ, కనకారావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.