సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ..

Distribution of CM relief fund checksనవతెలంగాణ – జక్రాన్ పల్లి 
మండల కేంద్రంలో సీఎం రిలీఫ్ ఫండ్ నిధుల నుoడి ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆదేశంతో జక్రాన్ పల్లి గ్రామానికి చెందిన సుమారు 6గురికి ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులను అందజేసినట్లు నిజాంబాద్ రూరల్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు వినోద్ తెలిపారు. జక్రాని పెళ్లి గ్రామానికి చెందిన ప్రణయ్ కుమార్ కు రూ.19000, ప్రణీత్ కుమార్ కు రూ.6000, బండారి గంగామణికి రూ.50000, గడం గంగారాం కు రూ.8000, నారెడ్ల సత్యగంగు కు రూ.10000, ఈశ్వరమ్మకు రూ.12500 ల చెక్కు లను పంపిణి చేసారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి సర్పంచ్ ఎక్స్ ఎంపీటీసీకాట్ పల్లి నర్సారెడ్డి, రూరల్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సొప్పరి వినోద్, సైకిల్ టెక్స్ అక్బర్, డిస్ రాజు, జీతేందర్ నాయక్, మోతె సాయిలు, నట్టా తిరుపతి, బుస శ్రీధర్,  సోప్పరి సుధీర్, గన్న జనార్దన్, మున్సాఫ్, గన్న శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.