నవతెలంగాణ – దుబ్బాక రూరల్
ప్రమాదాలు, అనారోగ్య పరిస్థితుల కారణంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న పేద ప్రజలకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని దుబ్బాక మాజీ జెడ్పిటిసి కడతల రవీందర్ రెడ్డి, పద్మనాభునిపల్లి తాజా మాజీ సర్పంచ్ పరశురాములు అన్నారు. సోమవారం సీఎం సహాయనిది ద్వారా దుబ్బాక మండల పరిధిలోని పద్మనాభుని పల్లి గ్రామానికి చెందిన కంచర్ల పరుశరాములు, సిద్ధన కనకవ్వ, కుకునూరి తార లకు రూ. ఒక లక్ష రెండు వేల రూపాయల చెక్కులను తాజా మాజీ సర్పంచ్ పరశురాములు బిఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం పేద ప్రజలకు అందించే సీఎం సహాయనిధి చెక్కులు ఎంతో దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు బొమ్మ బాలరాజ్, చింతకింది రమేష్, ముక్కపల్లి హరీష్ తదితరులున్నారు.