చల్వాయిలో  సీఎం రిలీఫ్ పండ్ చెక్కు పంపిణీ

నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని చలువాయి గ్రామంలో సోమవారం గ్రామ కమిటీ అధ్యక్షులు నామ్ పూర్ణచందర్ ఆధ్వర్యంలో 60 వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ ఎంపీపీ సూడి శ్రీనివాసరెడ్డి ముఖ్యఅతిథిగా  హాజరై బాధితులకు అందించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి గ్రామానికి చెందిన జంపాల సమత కు 60 వేల చెక్కు అందించి మాట్లాడారు. ఇది నిరు పేదలకు గొప్ప వరం ప్రజలు సద్వినియోగం చేసుకోవలన్నారు.అదేవిదంగా  గ్రామం లో ని మండల అధికార ప్రతినిధి భూరెడ్డి మధు బాపమ్మ భూరెడ్డి మాణిక్కమ్మ  95 సం ” లు నిన్న సాయంత్రం మరణించడం జరిగింది.ఈ విషయం తెలుసుకున్న మండల ఎంపీపీ సూడిశ్రీనివా రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి నర్సింహానాయక్, మండల కో ఆప్షన్ బాబర్, గణేశాలాల్, అజ్మీరా బిక్కు జన్ను సుధాకర్, లు పరామర్శించటం జరుగింది.గ్రామ మహిళఅధ్యక్షులు పూసల మంజుల పెద్దమ్మ  మేడిపల్లి సమ్మక్క నిన్న మరణించటం జరిగింది. వారి కుటుంబాన్ని కూడా పరామర్శించటం జరిగింది. ఈ కార్యక్రమం లో రైతు కోర్డినేటర్ బొల్లం ప్రసాద్ మండల నాయకులు గట్టయ్య, రేండ్ల శ్రీనివాస్, సత్తు భద్రయ్య, గ్రామ ప్రధాన కార్యదర్శి బైకని ఓదెలు, గ్రామ ఉపాధ్యక్షులు కొండ రమేష్, ,బి ఆర్ ఎస్ నాయకులు గోద కనుకయ్య, మీస రవి పూసల మంజుల,విజయ్ కృష్ణ రెడ్డి, ఆలుగం సమ్మయ్య, రసమళ్ళ సమ్మయ్య, కుమ్మరి వెంకన్న, సంజీవ, సమ్మయ్య, రుద్రారపు రవి, జన్నారం చంద్రమోహన్, సతీష్ లు తదితరులు పాల్గొన్నారు.