తడపాకల్ లో  సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

నవతెలంగాణ-ఏర్గట్ల
మండలంలోని తడపాకల్ గ్రామంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వివిధ అనారోగ్య కారణాలతో చికిత్స చేయించుకున్న మట్టెల రాజలింగం కు 51 వేలు, సుద్దాల సౌజన్యకు 32 వేలు, రాజేష్ కు 24 వేలు, సరితకు 23 వేల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద నిధులు మంజూరు కావడంతో చెక్కులను బాధితులకు అందజేశామని తెలిపారు.సీఎం రిలీఫ్ ఫండ్ నిధుల మంజూరుకు కృషిచేసిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ రెడ్డికి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జింక అనిల్, శ్రీనివాస్, రాజు, సాయన్న, అశోక్, రాము, తదితరులు పాల్గొన్నారు.