లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ..

Distribution of CM Relief Fund checks to beneficiaries..నవతెలంగాణ – భీంగల్ రూరల్ 
అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన పలువురికి  ముఖ్యమంత్రి సహా నిధి ద్వారా మంజురైన ఆర్థిక సహాయాన్ని(చెక్కుల) రూపంలో భీంగల్ మండలంలోని జాగీర్యాల గ్రామంలో పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన మంగారపు సాయి వరుణ్, పర్స పుట్టయ్య, మద్నూర్ అనూష  3మంది లబ్దిదారులకు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు చెక్కులను అందచేశారు.అనంతరం వారు మాట్లాడుతూ వేలాది మంది పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రతి నేల సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయూతనందించడం జరుగుతుందని తెలిపారు. ఈరోజు  మండలంలో వందలాది మంది పేదలకు వైద్య సేవల కోసం సీఎం సహాయనిధి ద్వారా చెక్కులు అందించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.