నేడు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

నవతెలంగాణ-వీణవంక
నేడు ఎంఎల్సీ, ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం సీఎం రిలీప్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేయనున్నారు. ఈ మేరకు ఎమ్మెల్సీ కార్యాలయం శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. మండలంలోని రెడ్డపల్లి గ్రామంలోని రైతు వేదికలో రైతులకు కరంట్ పై రైతు సదస్సు నిర్వహించనున్నారు. ఆ తర్వాత రెడ్డిపల్లి, ఘన్ముక్ల, గంగారం, చల్లూరు, మామిడాలపల్లి, దేశాయిపల్లి, కోర్కల్, హిమ్మత్ నగర్, కొండపాక, బ్రాహ్మణపల్లి, వీణవంక గ్రామాల్లోని లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కౌశిక్ రెడ్డి అందజేయనున్నారు. మధ్యాహ్నం సిర్సపల్లిలో జరిగే రైతు సదస్సులో పాల్గొననున్నారని కార్యాలయం పేర్కొంది.