మండలంలోని తడపాకల్ గ్రామానికి చెందిన ఉత్కం నర్సాగౌడ్ ఇటీవలే ఆసుపత్రిలో చికిత్స పొంది, సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకోగా,బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి సహకారంతో ఆయనకు 23 వేల రూపాయలు మంజూరు కావడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం చెక్కును భాధితుడికి అందజేశారు.ఈ సందర్భంగా బాధితుడు సునీల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.