మండలంలోని బట్టాపూర్ గ్రామానికి చెందిన వివిధ అనారోగ్య కారణాలతో చికిత్స చేయించుకున్న బాధితులకు బీఆర్ఎస్ నాయకులు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ..అనారోగ్య కారణాలతో చికిత్స చేయించుకున్న 10 మందికి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కృషితో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశామని అన్నారు.ఈ సందర్భంగా బాధితులు చెక్కుల మంజూరుకు కృషిచేసిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.బీఆర్ఎస్ నాయకులు కట్కం సాగర్,చిలుక కిషన్,భూషనవేణి గంగాధర్ పాల్గొన్నారు.