
శంకరపట్నం మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హాజరై చెక్కులు పంపిణీ చేశారు.అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శుల సమావేశానికి హాజరై మాట్లాడారు.గ్రామాలలో ఉన్న సమస్యలపై దృష్టి సారించి ఎప్పటికప్పుడే పరిష్కరించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్వాడీ టీచర్లు సిబ్బందిల ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.20 30 రకాల పిండి వంటలు తయారు చేశారు.ఈ సమావేశానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడుతూ,ఈ కార్యక్రమం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నమన్నారు. అంగన్వాడి కేంద్రాలలో కరెంటు సమస్య ఉందని అంగన్వాడి టీచర్లు చెప్పగా వారంలోగా కరెంటు ఏ ఏ సెంటర్లో లేదో అక్కడ కరెంటు ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి,ఆధ్వర్యంలో సబ్బండ వర్గాలకు సముచిత న్యాయం చేస్తున్నాడని ఆయన సేవలను కొనియాడారు.అలాగే రైతులు రెండు లక్షల రుణమాఫీ కాలేదని ఆధర్యపడవద్దని ఇండియన్ బ్యాంకు సాఫ్ట్వేర్ ప్రాబ్లం వల్ల తప్పిదం జరిగిందని కొందరు గిట్టని బిఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీపై బురద జల్లుగుతున్నారని ఆయన ఆరోపించారు. తొందరలోనే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోయి సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి బత్తిని శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గోపగాని బసవయ్య గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి,గట్టు తిరుపతి,కొత్తగట్టు ఆలయ చైర్మన్ ఉప్పుగల్ల మల్లారెడ్డి, స్థానిక తహసిల్దార్ బత్తుల భాస్కర్, ఎంపీ ఓ ప్రభాకర్,ఏపీవో శారద, ఐసిడిఎస్ సిపిడిఓ శ్రీమతి, మొలంగురి సదానందం, బొజ్జ చంద్రమౌళి, గొట్టే మధు, నాంపల్లి తిరుపతి,అధికారులు సీఎంఆర్ఎఫ్ చెక్కుల లబ్ధిదారులు, అంగన్వాడి టీచర్లు, గ్రామపంచాయతీ కార్యదర్శులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.