సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ..

Distribution of CM relief fund checks..– ప్రజల సంక్షేమం కోసం ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కృషి
నవతెలంగాణ – తొగుట
ప్రజల సంక్షేమం కోసం దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కృషి చేస్తున్నారని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని బ్రాహ్మణ బంజేరుపల్లి గ్రామానికి చెందిన రేణుక రూ.12 వేలు, ఎల్లారెడ్డి పేట గ్రామానికి చెందిన రుక్సానాబీ రూ.8500 లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ పండ్ చెక్కులకు అంద జేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎమ్మె ల్యే ఆదేశాల మేరకు సీఎం రిలీఫ్ పండ్ చెక్కులను అందించామన్నారు. ప్రమాదంలో గాయపడి అత్య వసర పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారికి సీఎం సహాయనిధి ద్వారా మేలు చేకూరుతుందన్నారు. కార్యక్రమంలో లబ్ధిదారులు, షాదుల్, రేపాక పెంటయ్య తదితరులు ఉన్నారు.
గురువారం తొగుట మండలంలో ఎమ్మెల్యే పర్యటన.. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గురువారం మద్యాహ్నం మండలంలో దుబ్బాక ఎమ్మెల్యే పర్య టించనున్నారని తెలిపారు. పెద్దమాసాన్ పల్లి, కాన్గల్ పాఠశాలల్లో క్రీడా దుస్తులు, కాన్గల్ లో వైకుంఠరథం, ప్రీజర్లను ప్రారంభించనున్నారని చెప్పారు. తాజా, మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు, గ్రామాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.