
ఊరుకొండ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు ఊరుకొండ బీఅర్ఎస్ పార్టీ ఆఫీసులో ఎమ్మెల్యే చర్లకోల లక్ష్మారెడ్డి చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ఉరుకొండ పేట సర్పంచ్ దండోద్కర్ అనితనాగోజి గారి తల్లి భారతమ్మ దశదినకర్మలో పాల్గొని బాదిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జెడ్పి చైర్ పర్సన్ శాంతకుమారి రవీందర్, మండల కో ఆప్షన్ సభ్యులు కలీం పాషా, పార్టీ ప్రెసిడెంట్ ధ్యాప వీరారెడ్డి, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు దుబ్బ రవి, ఊరుకొండ మండల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పోలే నరేష్, సర్పంచులు ఆంజనేయులు, బోయ లక్ష్మమ్మ, మాజీ సర్పంచ్ శ్రీనివాసులు, ఉపసర్పంచ్ లు పరశురాములు, భాస్కర్, మండల నాయకులు
కొమ్ము శీను, వెంకటేష్, పోలే రాజశేఖర్, జాంగిర్, రఘుమరెడ్డి, కప్పెర శీను, కప్పెర ధర్మరాజు, తదితరులు పాల్గొన్నారు.