సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ..

Distribution of CM Relief Fund cheques..నవతెలంగాణ – వేములవాడ రూరల్
వేములవాడ అర్బన్ మండలం ఆరేపల్లి గ్రామంలో  కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఇటిక్యాల వెంకటేష్ ఆధ్వర్యంలో మంజెడి  అవాజీ, ఇటిక్యాల రాజేందర్ కు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. లబ్ధిదారులు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కి కృషిచేసిన ప్రభుత్వం విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ కు, అర్బన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిల్లి కనకయ్య కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కిసాన్ సెల్ అధ్యక్షులు ఇటిక్యాల లింగయ్య , మహిళా అధ్యక్షురాలు ఠాకూర్ బాలవ్వ,తాజా మాజీ సర్పంచ్ నవీన – రాజు, మాజీ సర్పంచ్ సిలువని మల్లేశం,  మాజీ సర్పంచ్ ఆనందరెడ్డి,  కో అప్షన్ సభ్యులు సిలువని దేవయ్య,  సిలువని తిరుపతి,  మాజీ వార్డ్ సభ్యుడు హింగే ప్రభాకర్,లింగన్న,తదితరులు ఉన్నారు.