
వేములవాడ పట్టణంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను గురువారం పంపిణీ చేసిన మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, కౌన్సిలర్ ముప్పిడి సునంద- శ్రీనివాస్. ఈ సందర్భంగా కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం పేదల పక్షాన, ప్రజా పాలన చేస్తుందని అన్నారు. సంక్షేపదకాలు సక్రమంగా అందేలా స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రత్యేక చొరవతో నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేయడం జరుగుతుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్, సీనియర్ నాయకులు సూగూరి నాగభూషణం, కూర దేవయ్య, బిసి సెల్ టౌన్ ప్రెసిడెంట్ నాగుల రాము గౌడ్, తుము మధు,పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నేరెళ్ల శ్రీధర్ గౌడ్, బిసి సెల్ నియోజకవర్గం ఇంచార్జ్ అంబటి చంద్రశేఖర్ యాదవ్ తదితరులు ఉన్నారు.