మండలంలోని నీల్వాయి గ్రామంలో రూ.91,500 విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆదివారం మాజీ జడ్పీటిసి రుద్రబట్ల సంతోష్ కుమార్,కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ సాబీర్ అలీ తో కలిసి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షాన,ప్రజా పాలన చేస్తుందని అన్నారు.సంక్షేమపథకాలు సక్రమంగా అందేలా స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రత్యేక చొరవతో నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేయడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో నీల్వాయి మాజీ సర్పంచ్ గాలి మధు, ఒడిలా రాజన్న,తోకల రామచంద్రం,ముల్కల సత్యనారాయణ, ఇగురం జగన్, ఈర్ల మల్లయ్య, తులసి రామ్, జలపతి రావు, దొంతుల శ్రీశైలం, కామెర గణేష్, కామెర మల్లేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.