మండలంలోని కాటాపూర్, కాల్వపల్లి, బీరెల్లి, ఊరట్టం, బంధాల గ్రామాలకు చెందిన ఆరుగురికి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దండుగల మల్లయ్య ఆధ్వర్యంలో, బిఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణరావు, మండల బిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణరావు మాట్లాడుతూ.. బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రోగులకు వైద్యానికి సరిపోయేంత నిధులు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి అందించే వారిని, ఇప్పుడు అలాంటిది లేకుండా ఏదో మొక్కుబడిగా ఇస్తున్నారని అన్నారు. రైతు రుణమాఫీ విషయంలో కట్ ఆఫ్ డేట్ పెట్టడం వల్ల ములుగు జిల్లాలోని ఏజెన్సీలో రైతులు రుణమాఫీ కాక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ పోరిక గోవింద నాయక్, సీనియర్ నాయకులు కాకులమర్రి ప్రదీప్ రావు, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ రమణయ్య, మాజీ మండల అధ్యక్షుడు దిడ్డి మోహన్ రావు, సీనియర్ నాయకులు పత్తి గోపాల్ రెడ్డి, శేషగిరి, ఊరట్టం గ్రామం కమిటీ అధ్యక్షులు గజ్జల మహేష్, సిద్ధ బోయిన శివరాజ్ తదితరులు పాల్గొన్నారు.