సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ 

Distribution of CMRF chequeనవతెలంగాణ – మోర్తాడ్ 
 మండల కేంద్రంలో మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాములు లబ్ధిదారులకు మంగళవారం పంపిణీ చేశారు. అనారోగ్య సమస్యలతో కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన పలువురికి బాల్కొండ నియోజకవర్గం ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి సీఎం సహాయక నిధి చెక్కులను మంజూరు చేయించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు అశోక్, గ్రామ  సంఘం అధ్యక్షుడు జక్కం అశోక్, ఏఎంసి డైరెక్టర్ మైపాల్, లడ్డు గంగాధర్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.