విద్యార్థులకు రాగిజావ పంపిణీ..

నవతెలంగాణ- పెద్దవంగర
మండలంలోని అవుతాపురం జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు శనివారం రాగిజావ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయుడు రమేష్ కుమార్ మాట్లాడుతూ..విద్యార్థుల్లో రోగనిరోధక శక్తితోపాటుగా, జ్ఞాపకశక్తిని పెంచేందుకు రాగిజావ ఎంతో ఉపకరిస్తుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో క్షిరసాగర రవికుమార్, రామ్మోహన్, శ్రీను, నరసింహారావు, రత్నం, సంతోష్, శ్రీనివాస్, సునీత రాణి, సునీత, సురేష్, రామతార తదితరులు పాల్గొన్నారు.