పిల్లల్లో క్రికెట్ ఆట ఆనందం కిట్ల పంపిణీలో

– ఎన్ ఎస్ యు ఐ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బసవరాజ్ పటేల్

నవతెలంగాణ-మద్నూర్ : క్రీడల్లో అన్ని ఆటల కంటే పిల్లల్లో క్రికెట్ ఆట ఆనందాన్ని కలిగిస్తాయని ఎన్ ఎస్ యు ఐ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బసవరాజ్ పటేల్ తెలిపారు మద్నూర్ మండలంలోని చిన్న ఎక్లార గ్రామంలో చిన్నారి యువకులకు క్రికెట్ కిట్ల పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారి యువకులకు క్రికెట్ ఆట ఎంతో ఆనందాన్ని ఉత్సవాన్ని కలిగిస్తాయని పేర్కొన్నారు చిన్నారి యువకులు కిట్ల పంపిణీతో క్రికెట్ ఆటను బాగా ఆడుకోవాలని తెలిపారు ఈ పంపిణీ కార్యక్రమంలో ఆ గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఎన్ ఎస్ యు ఐ నాయకులు కార్యకర్తలు చిన్నారి యువకులు పాల్గొన్నారు.