నవ తెలంగాణ -నవీపేట్: మండలంలోని బినోల సొసైటీలో జీలుగు విత్తనాలను ఎంపీపీ సంగెం శ్రీనివాస్ బుధవారం పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల తమ పంట పొలాల్లో జిలుగు విత్తనాలు చల్లుకొని భూసారాన్ని పెంపొందించుకొని అధిక దిగుబడులను పొందాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ పితాంబర్, సొసైటీ వైస్ చైర్మన్ బాబర్, వ్యవసాయ అధికారి సురేష్ గౌడ్, బుచ్చన్న, విజయ్ డైరెక్టర్లు మరియు రైతులు పాల్గొన్నారు.