నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలంలోని బస్వాపురం గ్రామంలో గురువారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం భాగంగా నులి పురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భువనగిరి ఎంపీపీ నారాల నిర్మల వెంకటస్వామి యాదవ్ హాజరై, మాట్లాడారు. ప్రభుత్వం నులిపురుగుల నివారణ మాత్రలను ఉచితంగా పంపిణీ చేస్తుందని, విద్యార్థులు ఈ మాత్రలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బొల్లెపల్లి పిహెచ్సి డాక్టర్ యామిని, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కృష్ణవేణి, ఉపాధ్యాయులు లింగయ్య, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.