నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ..

నవతెలంగాణ – జక్రాన్ పల్లి 
మండలంలోని తొలికొండ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు గురువారం నులిపురుగుల నివారణ మాత్రలు వేసినట్లు ప్రధానోపాధ్యాయుడు జంగం అశోక్ తెలిపారు. ఈ సందర్భంగా ఎంఎల్ హెచ్పి ఆరోగ్య ప్రదాత తేజస్వి మాట్లాడుతూ ఆల్బెండొజాలు మాత్రలు తినడం వలన పిల్లల్లో రక్తయినత రాకుండా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో  జంగం అశోక్, ఏఎన్ఎం ఆశా వర్కర్లు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.