డబుల్ బెడ్ రూమ్ చెక్కుల పంపిణీ

Distribution of double bedroom chequesనవతెలంగాణ – నసురుల్లాబాద్ 
నసురుల్లాబాద్  మండల కేంద్రంలోని మైలరం గ్రామంలోని సహకార సంఘం భవనంలో శనివారం మాజీ మార్కెట్ కమిటీ, మాజీ సొసైటీ చైర్మన్ పెరిక శ్రీనివాస్ చేతుల మీదుగా డబుల్ బెడ్ రూం లబ్దిదారులకు చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ సొసైటీ అధ్యక్షుడు పెరిక శ్రీనివాస్  మాట్లాడుతూ… బాన్సువాడ నియోజకవర్గంలో మైలారం గ్రామం అంటే తెలంగాణ  మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి ఎంతో ఇష్టమన్నారు. గ్రామంలో సుమారు 40 డబుల్ బెడ్ రూమ్‌లు మంజూరు చేయగా అందరూ లబ్దిదారులు ఇల్లు కట్టకున్న వారికి విడతల వారీగా బిల్లులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. మైలారం గ్రామ అభివృద్ధి పట్ల ఎనలేని కృషి చేస్తున్న బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచ్ సాయికుమార్, మాజీ మండల ఉపాధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి మాజీ ఎంపిటిసిలు మహేందర్, చంద్ర గౌడ్, తదితరులు పాల్గొన్నారు.