
ఆలూరు మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలకు సుమారు 75 వేల రూపాయల డ్యూయల్ డిస్కులను విరాళంగా ఇచ్చిన విద్యాదాత ఏనుగు దయానంద రెడ్డి, ప్రధానోపాధ్యాయులు కే. మురళి అధ్యక్షతన, గ్రామాభివృద్ధి కమిటీ, వివిధ పార్టీల నాయకులు. మంగళవారం కృతజ్ఞత సభను ఏర్పాటు చేశారు. ఎంఈఓ నరేందర్ ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడుతూ . దయానంద రెడ్డి సుమారు 22 కోట్ల రూపాయల తో జిల్లాలోని వివిధ పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్లు, సైన్స్ లేబులు డ్యూయల్ డిస్కులు వంటి వాటిని ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా తెలియజేశారు. తమ గ్రామ పాఠశాలకు ఇంతటి సహాయం అందించిన దయానంద రెడ్డి దాతృత్వాన్ని ఎన్నటికీ మర్చిపోలేమని ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు. తన సొంత గ్రామమైన ఆలూరు కి డ్యూయల్ డిస్కులు ఇప్పించడంలో కృషి చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు వేల్పూర్ శ్రీనివాస్ , ఫిజికల్ డైరెక్టర్ జైడి రాజ్ కుమార్ ల కు ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పి .డి. రాజేష్, వీడిసి అధ్యక్షులు ముత్యంరెడ్డి, నాయకులు కళ్లెం మోహన్, కుమ్మరి మల్లేష్, దుమ్మాజీ శ్రీనివాస్, మూలాకిడి శ్రీనివాస్, ముక్కెర విజయ్, డాక్టర్ అరుణ్,డాక్టర్ అరుణ్, నవనీత్, పాఠశాల ఉపాధ్యాయులు, సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.