మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్ కాంటాలు పంపిణీ

నవతెలంగాణ-భిక్కనూర్
భిక్కనూర్ పట్టణ కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో సోమవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన అధ్యక్షులు మహమ్మద్ ఇలియాస్ ఎలక్ట్రానిక్ కాంటాలు ఐకెపి సెంటర్లకు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని సన్న రకం వడ్లకు మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఇస్తుందన్నారు. రైతులు దళారులను నమ్మీ మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు. రైతు సంక్షేమంలో భాగంగా మద్దతు ధర నిర్ణయించి రైతుల నుండి ధాన్యం కొనుగోలు ప్రభుత్వం చేస్తుందని, కేంద్రాల నుండి వడ్లను తరలించాలని లారీలను ఏర్పాటు చేస్తుందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని, ఆర్పిఎం 18 నుండి 20 వరకు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, మండల అధ్యక్షుడు భీమ్ రెడ్డి, పట్టణ అధక్షుడు దయాకర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుదర్శన్, మాజీ ఎంపీపీ గాల్ రెడ్డి, ఏఎంసి వైస్ చైర్మన్ స్వామి, ఏఎంసీ డైరెక్టర్లు, నాయకులు యాదవ రెడ్డి, మైపాల్ రెడ్డి,  మోహన్ రెడ్డి, లింబాద్రి, వెంకటేష్, సాజిత్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.