వృద్ధాశ్రమంలో నిత్యవసర సరుకులు, వస్తువులు పంపిణీ

నవతెలంగాణ – భువనగిరి రూరల్ 
భువనగిరి పరిధిలోని రాయగిరి లో గల సహృదయ అనాధ వృద్ధ ఆశ్రమానికి మాజీ భువనగిరి పార్లమెంట్ సభ్యులు బూర నర్సయ్య గౌడ్ జన్మదిన సందర్భంగా
ఆశ్రమంలో నివసిస్తున్న 50 మంది అనాధ వృద్దులకు నూతన వస్త్రాలు , నిత్య అవసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం  ఆశ్రమం లోని  గోశాల ను సందర్శించారు. ఈ సందర్భంగా బూర నర్సయ్య  గౌడ్ మాట్లాడుతూ  సహృదయ అనాధ ఆశ్రమ నిర్వాహకులు యాకూబీ చోటు  చేస్తున్న సేవలు అభినందనీయం అని  పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు , కార్యకర్తలు  పాల్గొన్నారు.