
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని జలగలంచ, మొండాల తోగు గుత్తి కోయగూడాలకు చెందిన 60 కుటుంబాలకు సోమవారం గోవిందరావుపేట మండలానికి చెందిన దుగ్గి శాంతయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పప్పులు, సబ్బులు, బియ్యం ,నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ధుగ్గి శాంతయ్య మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షులు ధుగ్గి మధు రాజ్ కుమార్ మాట్లాడుతూ మా తండ్రిగారైన దుగ్గి శాంతయ్య పేరుమీద ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆయన జ్ఞాపకార్థం పేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. తండ్రిగారి జ్ఞాపకార్థం పేదలకు నిరంతరం సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు.