– సీఐటీయూ జిల్లా కార్యదర్శి కుంట ఉపేందర్
నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని రావిరాల గ్రామంలోని వరద బాధితులకు నిత్యవసర వస్తువులను నెలకుదురు మండల సీఐటీయూ కార్యదర్శి ఈసంపల్లి సైదులు ఆధ్వర్యంలో పంపిణీ చేసినట్లు సిఐడి జిల్లా కార్యదర్శి కుంట ఉపేందర్ శనివారం తెలిపాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని రావిరాల గ్రామం అకాల వర్షాలు కురవడంతో వరద ముంపుకు గురైన బాధితులకు తొమ్మిది రకాల వస్తువులను పంపిణీ చేయడం జరిగింది అని అన్నారు. వర్షానికి తీవ్ర నష్టానికి గురైనరని వారికి తక్షణమే ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయ సహకారాలు అందించి రావిరాల గ్రామ ప్రజలందరి ని ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామంలో నష్టపోయిన ప్రతి వ్యక్తికి న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం అధికారులు కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఆకుల రాజు జిల్లా నాయకులు నాగన్న సీఐటీయూ నెల్లికుదురు మండల కార్యదర్శి ఈసంపల్లి సైదులు మల్లయ్య తోట శీను అంగన్వాడి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు స్నేహ బిందు సంపూర్ణ సరోజ సుధాకర్ గ్రామస్తులు నరసయ్య సైదులు శ్రీను కర్ణ సుభద్ర యాకమ్మ తదితరులు పాల్గొన్నారు.