
మండలం ప్రాజెక్ట్ నగర్ గ్రామంలో బుధవారం ఇటీవల సంభవించిన వరద విపత్తుకు గురై సర్వస్వం కోల్పోయిన వరద బాధిత కుటుంబాలకు ములుగు జిల్లా సేవా భారతి ఆధ్వర్యంలో ఓలం జనార్ధన్ నీలిమ ఆకాష్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు వోలం బుచ్చిలింగం సువర్ణ కేసముద్రం సమకూర్చిన నిత్యావసర వస్తువుల కిట్లను ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గారి చేతుల మీదుగా ప్రారంభించి వితరణ చేయడం జరిగింది.ఒక్కొటి పదిహేను వందల రూపాయల విలువ కలిగిన,పద్నాలుగు రకాల నిత్యావసర వస్తువులతో కూడిన ఒక లక్షా పదిహేడు వేల రూపాయల విలువ గల కిట్లను, వరద తాకిడికి గురై, దుర్భర స్థితిలో ఉన్న 78 వరద బాధిత కుటుంబాలకు వితరణ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా సేవాభారతి సేవా ప్రముఖ్ చల్లగురుగుల మల్లయ్య,బాధ్యులు ముక్కు సుబ్బారెడ్డి, వోలం శ్రీనివాస్, మంచన మనోహర్, మాడూరి దినేష్, బొడ రమేష్,దామరాజు సమ్మయ్య, కొత్త సుధాకర్ రెడ్డి, అడిచర్ల తిరుపతి, బద్దం జనార్ధన్, మేడిపల్లి సత్యనారాయణ, గట్టు సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.