నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల లో గల ఇంటర్ విద్యార్థులకు సోమవారం పరీక్ష ప్యాడ్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రోటరీ అధ్యక్షులు పట్వారి గోపి కృష్ణ మాట్లాడుతూ ఇచ్చిన పరీక్ష బ్యాట్స్ ని వినియోగించుకుని ఉన్నత ఫలితాలను సాధించి కళాశాలకు పేరు తేవాలని ఉన్నత స్థాయిలో స్థిరపడాలని వారు అన్నారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు దుర్గారెడ్డి రోటరీ సేవలు స్ఫూర్తిదాయకం, వారికి ప్రత్యేక అభినందనలు అని అన్నారు ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఉన్న కార్యవర్గానికి సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి పట్వారి తులసి, మాజీ అధ్యక్షులు ప్రవీణ్ పవార్, గోనె దామోదర్, స్పాన్సర్ రాస ఆనంద్, అధ్యాపకులు తేజు ,సురేష్, సంధ్య రాణి , విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.