మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులకు భారతమాత యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం పరీక్ష ప్యాడ్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు బుదారపు శ్రీనివాస్ మాట్లాడుతూ.. విద్యార్థులు పట్టుదలతో చదివి, ఉత్తమ గ్రేడ్ ర్యాంకులు సాధించాలన్నారు. సమయాన్ని వృధా చేసుకోకుండా సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజలింగం, సదయ్య, టకీ పాషా, అంజయ్య, యాకయ్య, షౌకత్ అలీ, విజయ్ కుమార్, వెంకన్న, శ్రీధర్, శ్రీనివాస్, సువర్ణ, హైమ, కరుణ, సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.