
డిండి మండల కేంద్రం లో ని మోడల్ స్కూల్, హై స్కూల్ లో ఎన్ ఎస్ యు ఐ ఆద్వర్యంలో సోమవారం10 వ తరగతి విద్యార్థులకు పరీక్ష మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పున్న దినేష్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి 10వ తరగతిలో ఉన్నత ర్యాంకులు సాధించాలని అన్నారు విద్యార్థులకు పరీక్షలలో పాస్ అయ్యేందుకు ఉపయోగపడే విధంగా స్టడీ మెటీరియల్ను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ నూకం వెంకటేష్, పోల వెంకటేష్ , అవుట మల్లేష్ , గడ్డమీది సాయి, చింతపల్లి నరేష్ , ఖయ్యూం, గెల్వయ్య, అజయ్, అనిల్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కరుణాకర్ రెడ్డి, పెంటావతి సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.