విద్యార్థులకు పరీక్ష ప్యాడ్, పెన్నుల అందజేత

నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండలంలోని  బషీరాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థులకు శుక్రవారం పెన్నులు, పరీక్ష ప్యాడ్లను అందజేశారు. నిర్మల్ జిల్లా బాసర వాస్తవ్యులు సాయినాథ్ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా బాసర  సరస్వతి అమ్మవారి వద్ద పూజించిన పరీక్ష ప్యాడ్, పెన్నులను పదో తరగతి విద్యార్థుల కోసం అందజేశారు. వాటిని పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సక్కారం అశోక్, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు బాజన్న, ప్రధానోపాధ్యాయులు కనక గంగాధర్ చేతుల మీదుగా పదవ తరగతి విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ అశోక్ మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షల్లో మంచిగా చదివి, పరీక్షలను బాగా రాయడం ద్వారా ఉత్తమ గ్రేడ్లు సాధించాలన్నారు. మండల, జిల్లా స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించడం ద్వారా గ్రామానికి, కన్న తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఇష్టంతో కష్టపడి చదివితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎస్ఎంసి  ఛైర్మెన్ నిరాడి సాయన్న, మాజీ ఉప సర్పంచ్ విక్రమ్, నాయకులు బైకన్ మహేష్, బందెల రాజు, రాజేందర్, ఉపాద్యాయులు మధుసూధన్, రవీంద్ర, తదితరులు పాల్గొన్నారు.