పదోతరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ ల పంపిణీ

నవతెలంగాణ – డిచ్ పల్లి

ఇందల్ వాయి మండలంలోని యెల్లరెడ్డి పల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న పదోతరగతి విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్వర్యంలో సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిసిసి డెలిగేట్ సుధాకర్, సీనియర్ నాయకులు కర్స మోహన్, ఎన్ ఎస్ యుఐ రూరల్ కన్వీనర్ ఆశిష్ లు మాట్లాడుతూ.. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి షష్టి పూర్తి సందర్భంగా వచ్చే నెలలో జరిగే పదోతరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ లను పంపిణీ చేసినట్లు వారన్నారు. విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులు సాధించి గ్రామం, మండల పేరు ప్రఖ్యాతులు సంపాదించుకే విదంగా చుడాలని, రాబోవు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అద్వర్యంలో మంచి కార్యక్రమాలు చేపడతామని వారన్నారు. ఈ కార్యక్రమం లో గ్రామ శాఖ అధ్యక్షులు, తదితరులు పాల్గోన్నారు.