
మండలం పాలెం జడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఎన్ ఎస్ సి ఐ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. మండల అధ్యక్షుడు నీరజ్ ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాల పదో తరగతి విద్యార్థులకు ఉచితంగా ఎన్ఎస్ఈఐ ఆధ్వర్యంలో పరీక్ష ప్యాడ్స్ పంపిణీ చేపడుతున్నట్లు తెలిపారు. విద్యార్థులకు బుధవారం పరీక్ష ప్యాడ్ పంపిణీ జరిగింది. పతి విద్యార్థి చక్కగా చదువుకొని తమ గ్రామాన్ని పాఠశాల పేరును నిలబెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల మైనార్టీ కాంగ్రెస్ నాయకుడు ఇంతియాజ్, బ్రహ్మ నాయుడు ,నరేష్ ,గంగారాం, సాయిన్న తదితరులు పాల్గొన్నారు.