నవతెలంగాణ – ఆర్మూర్
మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష అట్టలు, జామెట్రీ బాక్సులు, పెన్నుల వితరణ చేయడం జరిగిందని పాఠశాల ప్రధానో పాధ్యాయులు దొంతుల రవీందర్ తెలిపారు. పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశానికి విచ్చేసి 25 మంది విద్యార్థిని విద్యార్థులకు పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో వి డి సి అధ్యక్షులు మేడిదాల ప్రవీణ్ గౌడ్ ,సవీన్, సల్ల చిన్న రాజన్న, ఉపాధ్యాయులు మోతే మోహన్ ,విటల్ ,శోభ , విజయలక్ష్మి, శారద, సంగీత, లావణ్య తదితరులు పాల్గొన్నారు.