బాల్కొండ నియోజకవర్గంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రాంగి మండలం ఉమ్మడి మానాల గ్రామానికి చెందిన పలువురికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరు చేసిన ఆర్థిక సహాయం చెక్కులను పంపిణీ చేశారు. వివిధ అనారోగ్య సమస్యలతో ప్రైవేటు ఆసుపత్రిల్లో వైద్యం చేయించుకున్న పలువురు లబ్ధిదారులు ఆర్థిక సహాయం కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు.మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే వేములు ప్రశాంత్ రెడ్డి కృషి, సహకారంతో ఉమ్మడి మానాల గ్రామంలో 14 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆర్థిక సహాయ నిధి ద్వారా రూ.3 లక్షల 25వేల విలువైన చెక్కులను మంజూరు చేసింది.అట్టి చెక్కులను బిఆర్ఎస్ పార్టీ రుద్రాంగి మండల అధ్యక్షులు దేగావత్ తిరుపతి నాయక్ ఆధ్వర్యంలో స్థానిక టిఆర్ఎస్ నాయకులు లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి ఆర్థిక సహాయం చెక్కులను అందజేశారు. ఆర్థిక సహాయం చెక్కుల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి లబ్దిదారులు, గ్రామ ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఉమ్మడి మానాల గ్రామ పరిధిలోని అన్ని గ్రామాల మాజీ సర్పంచ్ లు, గ్రామ శాఖ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు అంబర్ సింగ్, భూమా నాయక్, జూల భూమన్న, లక్ష్మణ్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు రామదాస్, నాయిని రాజేశం, వికృతి రాజేశం, మలావత్ రవి, బాలు, గజన్ శర్మన్, తదితరులు పాల్గొన్నారు.