ఐదుగురికి ఆర్థిక సహాయం చెక్కుల అందజేత..

Handover of financial assistance checks to five.నవతెలంగాణ – కమ్మర్ పల్లి 

మండల కేంద్రంలోని పలువురు లబ్ధిదారులకు రాష్ట్ర మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయం చెక్కులను శనివారం అందజేశారు. ఈ మేరకు బిఆర్ఎస్ మండల పార్టీ కార్యాలయంలో గ్రామానికి చెందిన ఐదుగురు లబ్ధిదారులు వెలమల గంగాధర్, దుంపల నరసయ్య, ఏ. తిరుపతి, జె .ప్రసాద్ రావు, ఎన్. గౌతమి లకు రూ. లక్ష ఒక వెయ్యి 5వందల విలువ గల చెక్కులను లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆర్థిక సహాయం మంజూరుకు కృషిచేసిన  బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కొంటికంటి  నరేందర్,  మైనార్టీ  సెల్ మండల అధ్యక్షులు నవాబ్ పాషా, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు సంత రాజేశ్వర్, మల్కాయ్య గంగారం, పార్శపు చిన్న బాపయ్య, తదితరులు  పాల్గొన్నారు.