రోటరీ క్లబ్ కామారెడ్డి లో గురువారం క్లబ్ అధ్యక్షులు పి. రాజ నరసింహారెడ్డి అధ్యక్షతన రోటరీ క్లబ్ భవనంలో ఉచిత సైకిళ్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు ప్రసంగిస్తూ ప్రభుత్వ పాఠశాలలోని పేద బాలికలకు ఏంపవరింగ్ గర్ల్ స్టూడెంట్స్ పథకంలో భాగంగా రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ నార్త్, వెల్జాన్ సంస్థల సంయుక్త సహకారంతో ఉచిత 5 సైకిల్స్ వివిధ పాఠశాల విద్యార్థులకు పంపిణీ చేస్తూ, రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ స్థాయిలో అనేక రంగాల్లో సమాజ హిత, సంక్షేమ, ఆర్థిక, విద్యా, వైద్య రంగాలలో సహాయ సహకార అందించడంలో ముందుంటుందని తెలియజేశారు. ఈ సమావేశం నకు ముఖ్యఅతిథిగా కామారెడ్డి పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి హాజరై విద్యార్థినులకు సైకిల్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి మాట్లాడుతూ రోటరీ క్లబ్ కామారెడ్డి వారు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని, ముఖ్యంగా విద్యారంగంలోని పేద విద్యార్థినిలకు ఉచిత సైకిల్స్ ఇవ్వడం బాలికా సాధికారిత కై కృషి చేయడం సంతోషకరమని, విద్యార్థినులు బాగా చదువుకొని మంచి ప్రయోజకులై సమాజానికి తమ వంతు సేవ చేయాలని సూచించరు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు ధనంజయ, శంకర్, నాగ భూషణం, సత్యం, సుధాకర్ రావు, వెంకటరమణ, బాపురెడ్డి, సంతోష్ కుమార్ వివిధ పాఠశాల, ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.