ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో జుక్కల్ మండల కేంద్రంలో మండల ఐ ఆర్.సి.ఎస్ శాఖ పేదలకు ఉచిత దుప్పట్లను ఆదివారం నాడు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిర్వహించిన స్వామి వివేకానంద 162 వ జయంతి వేడుకలను ఘనంగా ఐఆర్ సి ఎస్ ఆధ్వర్యంలో జుక్కల్ మండల్ శాఖ అధ్యక్షులు డోంగ్లే ఉమాకాంత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలోని నిరుపేద వాళ్లకు మండల శాఖ ఆధ్వర్యంలో దుప్పట్లను పంపించడం చాలా సంతోషంగా ఉందని పేదవాళ్లకు చలి నుండి కాపాడుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. అదేవిధంగా మండల కేంద్రంలో నిర్వహించిన స్వామి వివేకానంద జయంతి వేడుకలు గ్రామస్తులు పాల్గొన్నారు. అంతకు ముందు స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వామి వివేకనంద అడుగుజాడలో నడవాలని యువతకు స్వామి వివేకానంద స్ఫూర్తిదాయకుడని సూచించారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ మండల సొసైటీ చైర్మన్ శివానంద్, శివకుమార్, ప్రశాంత్ పటేల్, రామచందర్, బాలు, మొగులాజి, కృష్ణమోహన్, ఐఆర్సిఎస్ మండల శాఖ కార్యవర్గ సభ్యులు మరియు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.