– ఎంబీసీ జాతీయ కన్వీనర్ కొండూరు సత్యనారాయణ
నవతెలంగాణ -సుల్తాన్ బజార్: రాష్ట్రంలోని మత్స్యకారులకు భరోసా కల్పించేందుకు కేసీఆర్ ప్రభుత్వం తలపెట్టిన ఉచిత చేపపిల్లల పంపిణీ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని ఎంబీసీ జాతీయ కన్వీనర్ కొండూరు సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 47 వేల చెరువుల్లో, 6,800 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉన్నాయని అన్నారు. వారి సంక్షేమం నిమిత్తం పెండింగ్ లో ఉన్న రూ.104 కోట్ల బిల్లును విడుదల చేయాలని అన్నారు, చేపపిల్లలు పంపిణీ చేయాలని కోరారు.