ఉచిత నోట్ పుస్తకాల పంపిణీ హర్షనియం 

– కలెక్టర్ నారాయణ రెడ్డి 
నవతెలంగాణ నల్గొండ కలెక్టరేట్
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించే పేద విద్యార్థులకు భారత సేవాశ్రమ సంఘం ఉచిత నోట్ పుస్తకాలను పంపిణీ చేయటం సంతోషకరమని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన భారత సేవాశ్రమ సంఘం ఆధ్వర్యంలో  నల్గొండ మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలు పంపిణీ చేశారు.  కతాల్ గూడ  ప్రాథమిక పాఠశాలలో నోట్ పుస్తకాలను పంపిణీ చేసి అనంతరం మాట్లాడారు. భారత సేవాశ్రమ సంఘం దేశవ్యాప్తంగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నదని, ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు, పేద విద్యార్థులు ఉంటారని గుర్తించి వారికి ఉచితంగా నోటు పుస్తకాలు అందజేయడం సంతోషకరమని  కలెక్టర్ అన్నారు.   ఉచిత నోటు  పుస్తకాల పంపిణీకి నల్గొండ జిల్లాను ఎంపిక చేసుకోవడం హర్షణీయమన్నారు.  జిల్లాలోని  ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి మాట్లాడారు.భారత సేవాశ్రమ సంఘం సెక్రటరీ మునీశ్వరానంద స్వామీ, నల్గొండ ఎంఈఓ కే.ఆర్ంధతి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయలక్ష్మి, పాఠశాల ఉపాధ్యాయులు, మండలంలోని ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు,విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.