జూనియర్ కళాశాలలో ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ


నవతెలంగాణ మల్హర్ రావు: మండల కేంద్రమైన తాడిచెర్లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉచిత పాఠ్యపుస్తకాలను కళాశాల అధ్యాపకులు విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా భూపాలపల్లి జిల్లా ఇంటర్ విద్యాధికారి దేవారాజు మాట్లాడారు ఎంతో విలువచేసే ఈ పుస్తకాలు విద్యార్థులు సద్వినియోగం చేసుకొని బాగా చదివి పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని కోరారు.
ఈ సందర్భంగా కళాశాలలో రెండవ సంవత్సరం పూర్తి చేసుకుని ఎంసెట్లో మంచి ర్యాంకు సాధించి బీటెక్, బి ఫార్మసీలో సీటు పొందినటువంటి 20 మంది విద్యార్థులను ప్రిన్సిపాల్, అధ్యాపకులు అభినందించారు. అలాగే తాడిచర్ల జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థులకు ఉచిత ఎంసెట్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. కళాశాలలో ల్యాబ్ సౌకర్యం ఇతర అన్ని వసతులు ఉన్నాయని పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు దూర ప్రాంతానికి వెళ్లకుండా అందుబాటులో ఉన్నటువంటి కళాశాలలో ప్రవేశం పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్ చార్జి లైబ్రేరియన్ రవీందర్ అధ్యాపకులు నరేందర్, వెంకట్ రెడ్డి, కరుణాకర్, స్వరూప రాణి, నరేష్, రమేష్, భరత్ రెడ్డి, జైపాల్, ఉమామహేశ్వరి, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.