విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ..

నవతెలంగాణ – బెజ్జంకి 
మండల కేంద్రంలోని బాలికల ప్రభుత్వోన్నత  పాఠశాల విద్యార్థులకు ఉచిత పాఠ్య,నోట్ పుస్తకాలు, అందుబాటులో ఉన్న యూనిఫామ్స్ ను ఎంపీపీ నిర్మల ముఖ్య అతిథిగా హజరై బోధన సిబ్బందితో కలిసి శుక్రవారం పంపిణీ చేశారు.ఇంచార్జీ ప్రధానోపాధ్యాయులు సురేశ్ బాబు, ఉపాధ్యాయులు నిర్మల, రూపదేవి, సరస్వతి, నర్సమ్మ, నగేశం, రవూఫ్, విద్యార్థులు పాల్గొన్నారు.
వీల్ ఛైర్ లో వచ్చి పుస్తకాల పంపిణీ..
బాలికల ప్రభుత్వోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రేవతి గత కొద్ది నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడింది. ప్రధానోపాధ్యాయురాలు రేవతి వీల్ చైర్ లో హజరై విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీలో పాల్గొనడం విధుల నిర్వర్తనలో చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలిచింది.